కొన్నివార్తలు ఆలస్యంగా తెలుస్తాయి..అయినా కూడా ఆసక్తికరంగానే వుంటాయి. టాలీవుడ్ లో ఓ హీరో, హీరోయిన్లపై బోలడు గ్యాసిప్ లు వున్నాయి. ఆ ఇద్దరూ చెట్టాపెట్టాలేసుకున్నారు అన్నది చాలా పాపులర్ గ్యాసిప్. వారసుడైన అతగాడు..టాప్ హీరోయిన్ అయిన ఈమెకు నడుమ సమ్ థింగ్ సమ్ థింగ్ అన్నది టాలీవుడ్ టాక్. పైగా ఆమె ఇలాంటి విషయాల్లో చాలా సీనియర్. ఇప్పటికే ఓ హీరోకి బై బై చెప్పేసింది..ఓ డైరక్టర్ తో తరచు హాయ్..హాయ్ అంటోంది అని టాక్.
అయితే ఇంతకీ ఇప్పుడు ఆలస్యంగా తెలిసిన విషయం ఏమిటంటే. ఈ ‘కపుల్’ న్యూఇయర్ సెలబ్రేషన్ ను కలిసి గోవాలో చేసుకున్నారన్నది. రిటన్ జర్నీలో..ఈ ఇద్దరితో పాటు వాళ్లకి సన్నిహితమైన మరో ఇద్దరు హీరోలు కూడా అదే ఫ్లయిట్ లో జర్నీ చేసారట. కానీ ఈ ఇద్దరూ, వాళ్లని వదిలి, లాస్ట్ సీట్లలోకి వెళ్లి, హాయిగా కబుర్లలో మునిగిపోయారట. వీళ్ల సంగతి తెలిసిన ఆ ఇద్దరూ కూడా పట్టించుకోలేదట. అదీ సంగతి.