చిన్న సినిమా తీసాడు. బాగనే ఆడింది. సరే అని కాస్త అబౌవ్ మీడియం రేంజ్ కు వెళ్లాడు..ఢమాల్ అంది. దాంతో నిర్మాత రెండు కోట్లు ఎదురు కట్టాల్సి వచ్చిందని వినికిడి. సినిమా అమ్మేసారు..రెండు కోట్లు లాభం చేసుకున్నారు. కళ్ల ముందు సూపర్ హిట్ కలలు చూపించిన పార్టనర్ కోట్లి ఇచ్చి, ప్రొడ్యూసర్ కోటి తీసుకున్నారు.
కానీ సినిమా లాస్ అయ్యేసరికి బయ్యర్లు బుస్సు మన్నారని వినికిడి. దాంతో ఇక లాభం లేక రెండు కోట్లు వారి నష్టాలకు సర్దుబాటు చేసినట్లు వినికిడి. అంటే వచ్చిన లాభం కోటి..ఎదురు కట్టింది రెండు.
కొసమెరపు ఏమిటంటే..తన ఫీల్డ్ కాని ఫీల్డ్ లో ప్రవేశించి, రెండో సినిమాతో ఇలా చేదు అనుభవం చవి చూసినా, మరో మంచి ప్రాజెక్టు వస్తే, చేద్దామని చూస్తున్నాడట సదరు బిజినెస్ మాన్..సినిమా రంగం మహిమ అలాంటిది.