Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మోత్సవం మే ఫస్ట్ వీక్?

బ్రహ్మోత్సవం  మే ఫస్ట్ వీక్?

త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న వైవిధ్యమైన ప్రయత్నం అ. ఆ. హారిక హాసిని పతాకంపై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో నితిన్..సమంత..అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రియల్ 22 లేదా 29న విడుదల చేసేందుకు వీలుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 15 రోజుల పాటు కేరళ లోని పోలాచ్చిలో షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అట్నుంచి వచ్చాక మళ్లీ హైదరాబాద్ లో షెడ్యూలు వుంటుంది. 

అయితే ఇక్కడ విషయం  ఏమిటంటే..ఎంత షెడ్యూలు వున్నా, ఏమయినా ఏప్రియల్ 22 లేదా 29న విడుదలకు సన్నాహాలు చేసుకోవడం.ఆ వేల్టికి అ..ఆ రెడీ అయిపోతుందా అన్నది పాయింట్. అదీ కాక ఏప్రియల్ తొలివారంలో సర్దార్ గబ్బర్ సింగ్ , ఆఖరి వారంలో బ్రహ్మోత్సవం వస్తాయని ఇప్పటి వరకు వున్న అంచనా. మరి అ..ఆ షెడ్యూల్ చేసుకుంటున్నారు అంటే బ్రహ్మోత్సవం ఎప్పుడు? అదీ అనుమానం. టాలీవుడ్ వర్గాల బోగట్టా ఏమిటంటే, బ్రహ్మోత్సవం మే తోలి వారంలో వస్తుంది. ఏప్రియల్ ఆఖరు వారం రాకపోవచ్చని.

పెద్ద సినిమాల విడుదల తేదీలు పక్కాగా వుండాలి. లేదూ అంటే చిన్న సినిమాల వ్యవహారాలన్నీ తారుమారైపోతాయి. అందుకే ఓ వారం అటయినా ఫరవాలేదు..గ్యారంటీ డేట్ ఫిక్స్ చేసుకోవాలని మే ఫస్ట్ వీక్ ఫిక్స్ చేసుకునే ఆలోచనలో బ్రహ్మోత్సవం వున్నట్లు వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?