మజ్ఞులోకి ప్రేమమ్ హీరోయిన్

మలయాళంలో పెద్ద హిట్ అయిన ప్రేమమ్ ను తెలుగులో మజ్ఞు పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మూడు ఎపిసోడ్ లు, ముగ్గురు కథానాయికలు వుంటారు. మెయిన్ ఎపిసోడ్…

మలయాళంలో పెద్ద హిట్ అయిన ప్రేమమ్ ను తెలుగులో మజ్ఞు పేరుతో నాగచైతన్య హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మూడు ఎపిసోడ్ లు, ముగ్గురు కథానాయికలు వుంటారు. మెయిన్ ఎపిసోడ్ కు శృతిహాసన్ ను తీసుకున్నారు. మరో ఎపిసోడ్ కు మాతృకలో నటించిన అనుపమ పరమేశ్వరన్ నే తీసుకున్నారు.

మూడో హీరోయిన్ గా చాలా మందిని అనుకున్నారు. కానీ ఎవరూ సెట్ కాలేదు. ఆఖరికి ఇప్పుడు ఆ పాత్రకు మరో మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈమె ఎవరో కాదు, ప్రేమమ్ లో నటించిన హీరోయిన్ నే. అంటే ప్రేమమ్ లోని ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరు తెలుగు రీమేక్ లోకి కూడా వచ్చినట్లయింది.

పెర్ ఫార్మెన్స్ పరంగా చూస్తుంటే వీళ్లు చేసిన రేంజ్ లో ఎవరు చేస్తారన్నది తేలకనే ఆఖరికివాళ్లనే తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మరో మలయాళ నటి తెలుగులోకి వస్తున్నట్లే. ఇప్పటికే అనుపమ వచ్చి రెండు మూడు సినిమాలు పట్టేసింది. ఈ మడొన్నా ఏం చేస్తుందో చూడాలి.