దర్శకుడు సుకుమార్ చాలా ప్రెస్టీజియస్ గా తయారు చేస్తున్న సినిమా పుష్ప. బన్నీ హీరో. ఈ సినిమాకు ఇఫ్పటికే విడుదల డేట్ ప్రకటించేసారు. ఆ డేట్ కు సినిమా రెడీ కావడమే ఇప్పుడు అసలు సిసలు టాస్క్.
దర్శకుడు సుకుమార్ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి నాన్ స్టాప్ గా అస్సలు గ్యాప్ తీసుకోకుండా సినిమా చేస్తున్నారు. మారేడిమిల్లి వెళ్లారు. అక్కడి నుంచి వస్తూనే కేరళ వెళ్లారు. అక్కడ నుంచి తమిళనాడుకు వెళ్లారు. ఇలా చకచకా షూట్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో లగ్జరీ హవుస్ ఆ వ్యవహారాలు ఇంకా వున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పెద్ద పెద్ద సినిమాలు అన్నీ డేట్ లు ప్రకటిస్తున్నాయి. ఆగస్టు డేట్ వదలుకుంటే సమస్య అవుతుంది.
అందుకే దర్శకుడు సుకుమార్ పై పరోక్షంగా వత్తిడి పెంచేందుకు బన్నీ తరువాత సినిమా విడుదల డేట్ కూడా ప్రకటించే ఆలోచనలో వున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ తరువాత సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వుంది. దానికి ఇంకా కథ, లైన్ నే లేదు. కానీ ముందు జాగ్రత్తగా 2022 సమ్మర్ విడుదల అని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏదో ఒక అకేషన్ చూసి, ఈ ప్రకటన వస్తుందని తెలుస్తోంది.