సుక్కూ కి నిందలతోనే నీరాజనం..!

నిందాపూర్వకమైన మాటలతోనే నాన్నకు ప్రేమతో దర్శకుడు సుకుమార్ కు ఒక ఫ్యాన్ నీరాజనాలు పలికాడు. విభిన్న మైన సినిమా తీశాడంటూ సుక్కూ ని ఆకాశానికి ఎత్తేశాడు.  సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో షేర్ అవుతున్న…

నిందాపూర్వకమైన మాటలతోనే నాన్నకు ప్రేమతో దర్శకుడు సుకుమార్ కు ఒక ఫ్యాన్ నీరాజనాలు పలికాడు. విభిన్న మైన సినిమా తీశాడంటూ సుక్కూ ని ఆకాశానికి ఎత్తేశాడు.  సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో షేర్ అవుతున్న ఈ ఆసక్తి కరమైన 'నాన్నకు ప్రేమతో' షార్ట్ రివ్యూ ఇలా ఉంది… 

-కుళ్ళు జోకులు, వెటకారపు పంచ్‌లు, చిన్నాపెద్దా తేడా లేకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్‌తో సంబంధం లేకుండా వెర్రి పుష్పాలను చేయడం… వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లు వుండగా.. ఎవరికి కావాలయ్యా నీ ఎమోషన్!

-రివేంజ్ డ్రామా అంటే ఎలా వుండాలి? ఒక్క వీరోచితమైన డైలాగ్ లేదు, కనీసం ఒక పీక కూడా తెగలేదు, అంతెందుకు చిన్న స్కూటర్ కూడా గాల్లో లేవలేదు, అందునా ఎన్టీఆర్ వంటి మాస్ హీరోని పెట్టుకుని సినిమా ఇలా తీశావేమయ్యా!

-సినిమాకి వచ్చామా, అర్థంపర్థంలేని సీన్లు చూశామా, పగలబడి విరగబడి నవ్వామా, కాసేపు కేకలు వేసుకున్నామా.. అన్నట్లుండకుండా.. ఫ్రిజుల్లో, ఏసీ రూముల్లో దాచుకున్న మా మెదళ్ళను బయటికి ఎందుకు తీయాలయ్యా!

-ఏం ఫైటయ్యా అది.. హీరోయిన్ చెప్పు జరిపితే వాళ్ళనివాళ్ళే విలన్లు కొట్టేసుకుంటే ఇక మా హీరో ఎందుకయ్యా!

-హీరోయిన్‌ని పాటల్లో కాకుండా నటనకు ప్రాధాన్యం వున్న కొన్ని సీన్లలో ఇరికించి.. ఎందుకయ్యా సాగదీశావు?

-తెలివి తక్కువవాడు, తెలివిగలవాడు, అతి తెలివిగలవాడు, వాడికి మించిన మరొక తెలివిగలవాడు.. ఏందయ్యా ఈ గోల? మాకు అర్థం కావాలా వద్దా!

చివరిగా: మేము సినిమా చూసేటప్పుడు మా కళ్ళు, చెవులు మాత్రమే పనిచేయాలి.. అలాకాదని మా మెదడుకి పనిచెప్పాలని చూస్తే ‘‘నీకు నెక్ట్స్ సినిమా వుండదు’’