కోన వెంకట్ రాలేదేలనో?

డిక్టేటర్ ఆఢియో సక్సెస్ మీట్ మాంచి వైభవంగా జరిగింది. సినిమాకు సంబంధించిన వారంతా వచ్చారు..సంగీత దర్శకుడు థమన్ తప్ప. అతను రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.. ఎందుకంటే చెన్నయ్ లో వుంటాడు.. బిజీగా వుంటాడు.మరి…

డిక్టేటర్ ఆఢియో సక్సెస్ మీట్ మాంచి వైభవంగా జరిగింది. సినిమాకు సంబంధించిన వారంతా వచ్చారు..సంగీత దర్శకుడు థమన్ తప్ప. అతను రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు.. ఎందుకంటే చెన్నయ్ లో వుంటాడు.. బిజీగా వుంటాడు.మరి సినిమాకు కథ,స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్, గోపీ మోహన్ లు కూడా రాలేదు. 

కోన వెంకట్ ఇక్కడే వుంటారు. పైగా ప్రస్తుతం మరీ అంత రాలేనంత బిజీగా ఏమీ లేరు. పోనీ అలా అని డిక్టేటర్ కు ఆయన దూరంగా వున్నారనీ అనుకొవడానికి లేదు. మొన్నటికి మొన్న గుమ్మడికాయ కొట్టిన సందర్భంగా జరిగిన పార్టీకి కోన హాజరయ్యారు. అంతకు ముందు, ఒకటి రెండు సార్లు సెట్ కు కూడా వచ్చారు. 

కానీ పబ్లిక్ గా జరిగిన ఈ పంక్షన్ కు మాత్రం రాలేదు. అలా అని కోన వెంకట్ ను ఎవ్వరూ తలుచుకోలేదు కూడా. ఒక్క బాలయ్య బాబు మాత్రం, తన ప్రసంగంలో అందరి పేర్లు చెబుతూ కోన వెంకట్, గోపీ పేర్లు కూడా గుర్తు చేసుకున్నారు.