నాన్నకు ప్రేమతో సినిమాలో సుక్కు మార్కు సీన్లు ఒకటి రెండు వున్నాయంట. వాటిల్లో రాజేంద్రప్రసాద్ పోషించిన హీరో తండ్రి పాత్ర మరణించే సన్నివేశం ఒకటి అంట. తండ్రి తరపున విలన్ పై పగ తీర్చుకునే క్రమంలో హీరో కొంత మేరకు సాధించిన విజయాన్ని టీవీలో చూస్తూ, ఆసుపత్రి మంచం మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తూ తండ్రి పాత్ర మరణిస్తుందంట.
ఆ సమయంలో ఎన్టీఆర్, ముందుగా నవ్వడం..తండ్రి ఎప్పుడూ నవ్వుతూనే వుండాలని చెప్పాడంటూ, ఆపై మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవడం..ఈ సీనంతా ఎన్టీఆర్ అద్భుతంగా చేసాడట. తండ్రి చనిపోతే నవ్వడం ఏంటీ సెంటిమెంట్ అవుతుందేమో అనుకున్నారట ముందు.
కానీ దర్శకుడు సుకుమార్ సీన్ వివరంగా చెప్పి, దాన్ని పండించే రేంజ్ లో పండిస్తే, ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చెప్పాడట. దాంతో ఎన్టీఆర్ తన టాలెంట్ అంతా చూపి, పండించాడని టాలీవుడ్ వర్గాల బోగట్టా.