పండగ సినిమాల హడావుడి ఈ సారి ఎక్కువ వుంది.నాలుగు సినిమాలు విడుదల సంక్రాంతికి విడుదల కావడం అన్నది పెద్ద కొత్త విషయం ఏమీ కాదు. గతంలో చాలా సార్లు జరిగినదే. పైగా నాలుగు సినిమాలైనా కలెక్షన్లు వుంటాయి కూడా. అయితే ఇదేదో పుష్కరానికి ఓసారి వచ్చే స్కైలాబ్ వంటి వ్యవహారం అన్నట్లు మీడియా హడావుడి పెరిగిపోయింది.
దీంతో మిగిలిన రెండు సినిమాల సంగతి ఎలా వున్నా, డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాలు, ఆయా హీరోల అభిమానుల మధ్య పోటీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాపై రాజకీయాలు మొదలైపోయాయని, ఎస్సెమ్సెస్ లు, చూడవద్దన్న సందేశాలు మామూలే అని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ అదే సమయంలో కొంత మీడియా ఈ ఉదంతంలో ఎన్టీఆర్ వైపు స్టాండ్ తీసుకోనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ తో అనుబంధం వున్నా, లేకున్నా, ఈ రెండుసినిమాల పోరులో మాత్రం ఓ సెక్షన్ ఆప్ మీడియా ఎన్టీఆర్ సినిమాకు అండగా నిలిచే అవకాశం వుందని వదంతులు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వందతులు ఎప్పుడైతే వినిపించడం ప్రారంభమైందో, అప్పుడే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఇలా డిసైడ్ అయిందని టాక్.సినిమా విడుదలయ్యాక చాలా సపోర్టు ఆ మీడియా నుంచి లభిస్తుందని తెలుస్తోంది.