చిన్న, మీడియం సినిమాల వరకు దర్శకుడు ఇంద్రగంటి కి తిరుగులేదు. ఒక్కసారిగా తనవి కాని జోళ్లలో కాళ్లు పెట్టి వి సినిమాతో దెబ్బతిన్నారు.
ఇప్పుడు మళ్లీ తన స్టయిల్ కు వచ్చి హీరో సుధీర్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఈ రోజు ప్రకటించబోతున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ భలే వెరైటీగా వుందని తెలుస్తోంది. ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'…ఇదీ టైటిల్. అత్తారింటికి దారేది సినిమా దగ్గర నుంచి టాలీవుడ్ టైటిళ్ల స్టయిల్ మారింది. వాక్యాలు కూడా టైటిళ్లుగా వస్తున్నాయి.
అదే దారిలో ఇప్పుడు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంద్రగంటి గతంలో కూడా 'అంతకుముందు ఆ తరువాత' లాంటి డిఫరెంట్ టైటి్ళ్లు పెట్టారు.