పవర్ ప్లే సినిమా పక్కా హిట్ అని, నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో తయారైన పవర్ ప్లే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం జరిగింది. ఈ ఫంక్షన్ లో కేఎస్ రామారావు మాట్లాడుతూ డెఫినెట్‌గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది, ఈ సినిమా ను అనుకున్న బడ్జెట్‌లోనే కంప్లీట్ చేశాం అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనంత్ సాయి చెప్పగానే చాలా ఆశ్చర్యమేసింది.
దానికి కారణం మహిధర్, కొండా విజయ్ కుమార్. . కార్పోరేట్ సిస్టమ్‌లో సినిమా ఎలా చేయాలో మొదటిసారి ఈ సినిమాతోనే నేర్చుకున్నాను. ట్రైలర్ చూశాక కొండా విజయ్‌కుమార్ ఆలోచనలు మారిపోయాయి అనిపించింది. ఎందుకంటే రాజ్‌తరుణ్ తో ఫస్ట్ టైమ్ ఇలాంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం నిజంగా గొప్ప విషయం అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ – ` `హేమల్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోస్టార్. పూర్ణ ఆ పాత్ర చేయడం వలన సినిమా వేరే లెవల్‌కి వెళ్లింది. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు. విజయ్, నంద్యాల రవిగారు, మధునందన్ కలిసి అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతంలో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చారు. దేవేష్ గారు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి స్పెషల్ థ్యాంక్స్. ఆయన కేవలం దర్శకుడే కాదు నా ఫ్యామిలీ మెంబర్.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె రాధామోహన్ మాట్లాడుతూ – “ఈ టీమ్‌తో మా బేనర్‌లో ఒరేయ్ బుజ్జిగా.. మూవీ చేశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు హోమ్ ప్రొడక్షన్ అనిపిస్తోంది. ఈ మూవీ ఒక మంచి టీమ్ వర్క్. తక్కువ టైమ్‌లో సినిమా తీయాలి అంటే డైరెక్టర్, డిఓపికి మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలి. అందుకే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రోమోస్, ట్రైలర్ చూస్తుంటే రాజ్ కొంత రఫ్ అయ్యాడనిపిస్తోంది టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్“ అన్నారు
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ – “ ఒక వండర్‌ఫుల్ టీమ్. ఇలాంటి ఒక క్యారెక్టర్ ని నేను ఇంతవరకూ చేయలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విజయ్‌గారికి, నిర్మాతలకి థ్యాంక్యూ వెరీ మచ్. నిర్మాత దేవేష్ నా బెస్ట్ ఫ్రెండ్. రాజ్ చాలా మంచి యాక్టర్. విజయ్ లాంటి స్వీట్ డైరెక్టర్‌ని నేను ఇంత వరకూ చూడలేదు. ఒక డైరెక్టర్ ఇంత కామ్‌గా వర్క్ చేయడం నేనింతవరకూ చూడలేదు“ అన్నారు.
నిర్మాత దేవేష్ మాట్లాడుతూ – “ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది ఇంతటితో అయిపోలేదు సక్సెస్‌మీట్‌లో మళ్లీ కలుద్దాం“ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాలమర్తి అనంత్ సాయి మాట్లాడుతూ – “లాక్‌డౌన్ ఎండ్ అయిన రెండు రోజుల్లో విజయ్ ని కలిసి సినిమా చేద్దామా అని అడగగానే వెంటనే డెఫినెట్ గా చేద్దాం అని షూటింగ్ స్టార్ట్ చేశారు. రాజ్ తరుణ్ ఫుల్ సపోర్ట్ చేశారు. మార్చి 5న మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ – . రాజ్ ఇప్పటివరకూ కామెడీ, లవ్‌స్టోరీ సినిమాలే చేశాడు. ఈ లాక్‌డౌన్‌లో అందరూ వరల్డ్ సినిమాలు చూశారు. కాబట్టి కొత్తగా సినిమా చేసి మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకోవాలి అని ఈ సినిమా చేయడం జరిగింది.
రాజ్, నేను ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్. నేను నంధ్యాల రవి, రాజ్ కలిసి ఈ సినిమా అనుకున్నప్పుడు ఆడియన్స్ ఈ సినిమాకి ఎందుకు రావాలి అని అనుకున్నాం. కెమెరా పరంగా మేకింగ్ స్టైలిష్‌గా ఉండే సినిమా. ఇప్పటి వరకూ కామెడీ చేసిన నటుల్ని కొత్తగా ఆవిష్కరించే సినిమా. అలాగే ప్లాన్ చేశాం.
ఫస్ట్ టైమ్ రాజ్‌లో ఇంకో యాంగిల్ చూస్తారు. హేమల్ చాలా బాగా నటించింది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో పూర్ణ నటించింది. ప్రిన్స్ ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేశారు. ఆండ్రూ గారు తన సినిమాలకి విభిన్నంగా ఈ సినిమా చేశారు. అన్నారు.