జగన్ నుంచి భాజపా వరకు…అదే స్ట్రాటజీ

ఆ మీడియాకు చేతనయినది ఒకటే..వ్యక్తిత్వ హననం. అది జగన్ అయినా భాజపా నాయకులు అయినా ఒకటే స్ట్రాటజీ. బురద వేసేయడం. మేము వేసేసాం..మీరు కడుక్కోండి అనడం. ట..ట..అంటూ ట బోగట్టా అనే స్కీము ఆధారం…

ఆ మీడియాకు చేతనయినది ఒకటే..వ్యక్తిత్వ హననం. అది జగన్ అయినా భాజపా నాయకులు అయినా ఒకటే స్ట్రాటజీ. బురద వేసేయడం. మేము వేసేసాం..మీరు కడుక్కోండి అనడం. ట..ట..అంటూ ట బోగట్టా అనే స్కీము ఆధారం చేసుకుని, తాము మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే మాటే మరిచిపోయి, కథనాలు వండి వార్చేయడం. జనాల మీదకు కథనాల అనుమానాలు వదిలేయడం. 

జగన్ టైమ్ లో లక్ష కోట్ల అవినీతి అనే టముకు వేసారు. పోస్టర్లు వేసారు. వాటిని ఫుల్ పేజీల్లో ప్రకటించారు. ఇప్పటికే అదే బాజా వాయిస్తూ వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు భాజపా జనాలు మాంచి మిత్రులు అయ్యారు. అందువల్ల వాళ్ల మీద బురద వేయాలని చూడలేదు.

కానీ ఇప్పుడు ఆంధ్ర భాజపా ఈ మీడియాను పక్కన పెట్టింది. అంతే మళ్లీ బురద వెతికి తెచ్చారు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటన అంటూ ఓ చీకటి డీల్ ను బయటకు తెస్తున్నామని చెబుతూ, 30 కోట్లు వసూలు చేసారని భాజపా పెద్ద తలకాయలు రెండింటి మీద బురదవేసారు. మరి ఈ రెండేళ్లు ఈ బురదను ఎందుకు దాచినట్లో? అంటే ఇలాంటి బురద అంతా దగ్గర పెట్టుకుంటారు. అవసరమైతే ఎలా వాడాలనుకుంటే అలా వాడతారన్నమాట.

నికార్సయిన మీడియా అయితే అప్పుడే బయటపెడితే సబబుగా వుండేది. కానీ ఇప్పుడు బయటపెట్టడం అంటే మిత్ర బేధమే కారణం అని జనాలకు అర్థం అయిపోతోంది. ఇక భాజపా నేతలు ఇలాంటి వాటికి సిద్దం అయిపోవాలి. లేదా కాళ్ల బేరానికి వచ్చి, ఆ మీడియా బ్యాన్ ను ఎత్తేయాలి. చూడాలి ఏం జరుగుతుందో?

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

పవన్ కళ్యాణ్ మానసిక రోగి