టాలీవుడ్ అంటేనే సెంటిమెంట్ల మయం. ఇక్కడ సెంటిమెంట్లు ముందు పుట్టి, ఆపై సినిమాలు పుడతాయి. పండగ సినిమాల పోటీ కాదు కానీ..ఎవరు అభిమానులు వారి వారి హీరోల తరపున తెగ సెంటిమెంట్లు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. కొన్ని సెంటిమెంట్లు ఆయా సినిమాలకు పాజిటివ్ గా వుంటే, మరి కొన్ని సెంటిమెంట్లు నెగిటివ్ గా వుంటున్నాయి. మఖ్యంగా ఎందు వల్లనో కానీ, నాన్నకు ప్రేమతో సినిమాకు నెగిటివ్ సెంటిమెంట్లు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి.
ఎవరికి వారు వారి చిత్తానికి వినిపిస్తున్న ఆ సెంటిమెంట్ ముచ్చట్లు ఇలా వున్నాయి. ఎన్టీఆర్ కు 'న' అక్షరం అచ్చిరాలేదని ఒకటి. శ్రీమంతుడు ఒక్కటే యునానిమస్ హిట్ రాజేంద్రప్రసాద్ చేసిన వాటిలో అని, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి హిట్ అనిపించుకున్నాయని, మిగిలనవన్నీ డిజాస్టర్లే అని సెంటిమెంట్లు వినిపిస్తున్నాయి. అన్నింటికన్నా బలంగా వినిపిస్తున్న సెంటిమెంట్ ఏమిటంటే, తెలుగు సినిమా హీరోలకు గుబురు గడ్డం అచ్చిరాదన్నది.
చిరంజీవి , వెంకీ , బాలయ్య, ఇలా చాలా మంది గడ్డాలు పెంచి సినిమాలు చేసి, ఫ్లాపులు చూసిన వారే అని. ఇక నాగార్జున సినిమాకు సంబంధించి పంచె కట్టిన వన్నీ హిట్ అనీ, జానకిరాముడు, అన్నమయ్య అంటూ సెంటిమెంట్లు వల్లిస్తున్నారు. కానీ హీరో ఆత్మగా వేసే సినిమాలు అంతగా నడవవని మరో మాట..
ఎక్స్ ప్రెస్ రాజా ఆ సినిమా డైరక్టర్ కు రెండోసినిమా అని, ఈ గండం గట్టెక్కిన దర్శకులు చాలా కొద్ది మందే వున్నారని మరో టాక్. సంక్రాంతికి విడుదలైన చిన్న సినిమాలు పెద్దహిట్ అవుతాయని, అందువల్ల ఎక్స్ ప్రెస్ రాజాకు ఢోకా లేదని ఇంకో మాట. ప్రస్తుతం కోన వెంకట్ టైమ్ బాగా లేదని, బ్యాక్ టు బ్యాక్ మూపు ఫ్లాపులు వచ్చాయని, డిక్టేటర్ ను ఆయన జాతకం ఏం చేస్తుందో అని మరో సెంటిమెంట్.
పండగ వస్తే సినిమాలు వస్తాయి. సినిమాలు జనం ముందుకు వస్తే జాతకాలు తెలుస్తాయి. జాతకాలు తేలితేనే..సెంటిమెంట్లు ఏ మేరకు నిజం..ఏ మేరకు అబద్ధం అన్నది తేలిపోతుంది.