ఇప్పుడే చూసుకో కోనా!

కోన వెంకట్..బ్రూస్ లీ విడుదల తరువాత తను ఇచ్చిన సీన్ ఒక్కటి కూడా వాడలేదని సీన్ క్రియేట్ చేసిన వైనం.. అఖిల్ విడుదల తరువాత గట్టిగా ఏమీ చెప్పలేని అసహాయత… Advertisement సౌఖ్యం విడుదల…

కోన వెంకట్..బ్రూస్ లీ విడుదల తరువాత తను ఇచ్చిన సీన్ ఒక్కటి కూడా వాడలేదని సీన్ క్రియేట్ చేసిన వైనం.. అఖిల్ విడుదల తరువాత గట్టిగా ఏమీ చెప్పలేని అసహాయత…

సౌఖ్యం విడుదల తరువాత ఆ సినిమాకు తాన పేరు మాత్రమే ఇచ్చా అంటూ సన్నిహితులకు చెప్పిన సంగతి.. ఇవన్నీ బహుశా బాలయ్య బాబు దృష్టికి వచ్చాయేమో? అందుకే..చూడు..ఒకవైపే చూడు.అన్న స్టయిల్ లో..

కోనా..ఇప్పుడే చూడు..మళ్లీ ఆ తరువాత రెండు సీన్లు వాడలేదు..ఆరు సీన్లు వాడలేదు అంటే కాదు..అని చిన్నగా చెప్పారంటూ వదంతి ఒకటి టాలీవుడ్ లో వినిపిస్తోంది. నిజంగా బాలయ్య అన్నారో..లేక కోన అంటే కిట్టని శ్రీనువైట్ల క్యాంప్ అలా పుట్టించిందో? ఇటీవల ఇదో సమస్య ఎక్కువగా వుంది టాలీవుడ్ లో. కోన వెంకట్ పై వార్త వస్తే, అది శ్రీనువైట్లు వర్గం కావాలని రాయించిందని…శ్రీను వైట్లపై వార్త వస్తే, కోన వెంకట్ రాయించారని..ఇలా అనుకుని సంతృప్తి పడుతున్నారు.

సరే ఆ సంగతి  అలా వుంచితే కోన వెంకట్ కు ఇప్పుడు డిక్టేటర్ సినిమానే ఆశ..శ్వాస..కూడా. ఈ సినిమా హిట్ అయిపోతే, కోన వెంకట్ ఊపిరి పీల్చుకుంటాడు. మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే అవకాశం బలంగా వుంటుంది.