ఈ 24 గంటలు ఎన్టీఆర్ ఫుల్ బిజీ

నాన్నకు ప్రేమతో సినిమా పూర్తయిన రోజు, ఆ ముందు రోజు అంటే 4, 5 తేదీల్లో హీరో ఎన్టీఆర్ క్షణం రెస్ట్ తీసుకోలేదట. రాత్రి ఎనిమిది-తొమ్మిది నడుమ మీడియా మీట్ కు హాజరయ్యాడంతే. మిగిలిన…

నాన్నకు ప్రేమతో సినిమా పూర్తయిన రోజు, ఆ ముందు రోజు అంటే 4, 5 తేదీల్లో హీరో ఎన్టీఆర్ క్షణం రెస్ట్ తీసుకోలేదట. రాత్రి ఎనిమిది-తొమ్మిది నడుమ మీడియా మీట్ కు హాజరయ్యాడంతే. మిగిలిన సమయం అంతా సెట్ మీదే వున్నాడట. టాకీ పార్ట్ ఫినిష్ చేయడం, ప్యాచ్ వర్క్ లో పాల్గొనడం, తెల్లవారి మళ్లీ అవసరమైన చోట్ల డబ్బింగ్ చెప్పడం ఇలా నిన్న ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు అస్సలు విశ్రాంతి అన్నది మరిచిపోయాడట. 

నాన్నకుప్రేమతో సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం అన్నది ఎన్టీఆర్ ఎంత ప్రెస్టీజ్ గా తీసుకున్నాడో దీన్ని బట్టి అర్థం అవుతోంది. తన సైడ్ లోపం వుండడానికి వీల్లేదని కిందామీదా పడ్డాడట. అంతే కాదు, దేవీని, సుకుమార్ ను సదా రిక్వెస్ట్ చేస్తూ, పని ఎక్కడా ఆగకుండా చూసాడట. 

హీరో స్వయంగా ఫీల్డ్ లో వుండి, పని కోసం తాపత్రయ పడడంతో మిగిలిన వారు ఇక మరేం మాట్లాడలేక, యుద్ధప్రాతిపదికన ఫినిష్ చేసారట. నిజానికి ఇలా చేయకుండా మరో రెండు రోజుల పని వుండి వుండేదని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.