Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ రెండో సినిమా డేట్లు ఎవరికి?

అఖిల్ రెండో సినిమా డేట్లు ఎవరికి?

అఖిల్ రెండో సినిమా వ్యవహారం దాదాపుగా పెండింగ్ లో పడింది. ఈ నెలాఖరుకు కానీ నాగ్ ఆ సినిమా గురించి ఆలోచించేలా లేడు. అఖిల్ రెండో సినిమా డేట్లు నిర్మాత బండ్ల గణేష్ కు ఇచ్చాడని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. దాంతో బండ్ల గణేష్ సరైన దర్శకుడి కోసం చూస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ వేరే టాక్ వినిపిస్తోంది. 

అఖిల్ రెండో సినిమా బండ్ల గణేష్ కు కాకపోవచ్చని. సోగ్గాడు చిన్ని నాయనా వ్యవహారాలు సెటిల్ అయిపోయి, ప్రాఫిట్ రేంజ్ కు చేరుకుంటుదా, లేదా అన్నది చూసి, అఖిల్ సినిమాను నాగ్ నే స్వయంగా నిర్మించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అఖిల్ తొలి సినిమాలో నిర్మాణ లోపం లేదు. కానీ సినిమా ఫలితం వల్ల నిర్మాత సఫర్ అయ్యారు. అందువల్ల ఈసారి తానే దగ్గర వుండి చూడాలని నాగ్ అనుకుంటున్నాడని వినికిడి. 

నాగ్ చేతిలో ఇప్పుడు ఊపిరి సినిమా ఒక్కటే వుంది. అది కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కమిట్ మెంట్లు ఏవీ లేవు. అందువల్ల కొన్నాళ్లు అఖిల్ సినిమా వ్యవహారాలు చూడాలని నాగ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?