పూరి జగన్నాధ్ దగ్గర కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలోనే స్టాఫ్ వుంటారు. రైటింగ్, డైరక్షన్, ప్రొడక్షన్ ఇలా..చాలా మందే వుంటారు. పైగా పూరి ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజీగా వుంటాడు..పైగా సినిమాకు సంబంధించిన అన్ని పనులు తన చేతిలో వుంచుకుంటాడు. పైగా తన వైష్ణో మీడియా వ్యవహారం కూడా వుంది. అందువల్ల కాస్త స్టాఫ్ ఎక్కువే. అందుకే మంచి ఆఫీసు కూడా కట్టాడు. దర్శకుల్లో ఎవరికీ లేనంత మంది సిబ్బంది, ఆఫీసు పూరికి వున్నాయి.
ఇప్పుడు ఈ సిబ్బంది పై పూరి ఆగ్రహంతో వున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. చేతిలో వున్న రోగ్ సినిమా తరువాత ఇక మీరు నాకు అక్కరలేదు అనే అర్థం వచ్చేలా పూరి తన సిబ్బందికి మెసేజ్ లు కూడా పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అసలు రోగ్ సినిమానే వుంటుందా వుండదా అన్న అనుమానాలు వుండనే వున్నాయి. మరోపక్క పూరి చేతిలో మరే సినిమా లేదు. ఏ హీరో రెడీగానూలేరు. మహేష్, రామ్ చరణ్, బన్నీ, ఇలా లిస్టు రాసుకుంటూ పోతే ఎవరు పూరికి అవకాశం ఇచ్చేలా లేరు.
పూరితో ఓ సినిమా చేస్తే చాలు అనుకునేవాళ్లు ఒకరిద్దరు ఎవరైనా వుంటారేమో మరి? కానీ ప్రస్తుతానికి అయితే ఖాళీ. రోగ్ సినిమా కనుక అటకెక్కేస్తే, పూరి పూర్తిగా ఖాళీ అయిపోతాడు. చేతిలో సినిమా లేకుండా ఇంత మంది సిబ్బందిని నిర్వహించడం కష్టమే. పైగా పూరికి ఫైనాన్స్ కమిట్ మెంట్ లు కూడా వున్నాయని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అందుకే సిబ్బందికి ఈ మెసేజ్ లు పెట్టాడని ఓ టాక్.
అదికాదని, చార్మి వ్యవహారం..ఆమె పెత్తనం తదితర ఇన్ సైడ్ వ్యవహారాలు అన్నీ ఈ సిబ్బంది కారణంగానే లీక్ అయ్యాయని, అందుకే వారిపై పూరి ఆగ్రహంతో వున్నాడనీ మరో టాక్. పూరి దగ్గర స్వేచ్ఛగా పని చేయడానికి అలవాటు పడిన సిబ్బంది, చార్మి రూల్స్ నచ్చక, విషయాలు వెబ్ మీడియాకు లీక్ చేసారని తెలుస్తోంది. అందుకే చార్మిని ఆఫీసు నుంచి బయటకు పంపాల్సి వచ్చింది పూరికి.
ఆ కారణంగాను, చేతిలో సినిమాలు లేని కారణంగానూ వీలయినంత మంది సిబ్బందిని తగ్గించుకునే పనిలో పూరి వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేం కాదు, పూరీకి ఇలా సిబ్బందిపై ప్రాక్టికల్ జోక్స్ వేయడం అలవాటే అని మరోటాక్ కూడా వుంది మరి.