సూర్య సరసన దీపిక?

దీపిక పడుకొనె..నార్త్ ప్రేక్షకులకే కాదు..సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిపోయిన పేరు. దీపిక సౌత్ లో నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో వుంటుంది. కానీ ఇంత వరకు కాంబినేషన్ సెట్ కావడం లేదు.…

దీపిక పడుకొనె..నార్త్ ప్రేక్షకులకే కాదు..సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిపోయిన పేరు. దీపిక సౌత్ లో నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో వుంటుంది. కానీ ఇంత వరకు కాంబినేషన్ సెట్ కావడం లేదు. మహేష్ సరసన అయితే దీపిక పెర్ ఫెక్ట్ జోడీగా వుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వుంది. కానీ దీపికకు హిందీ సినిమాలతోనే తీరుబాటు వుండడం లేదు. 

ఇంతకీ లేటెస్ట్ బజ్ ఏమిటంటే, సూర్య-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హారిక హాసిని చినబాబు నిర్మించే సినిమాకు దీపిక హీరోయిన్ అయితే ఎలావుంటుందీ అన్న ఆలోచన అయితే వుందట. ఈ విషయంలో నిర్మాత చినబాబు చాలా పాజిటివ్ గా వున్నారట. దీపిక ఓకె అనాలే కానీ, కాంబినేషన్ సెట్ కావడానికి ఇక ఇటువైపు నుంచి ఎలాంటి ఆలోచన మిగలలేదు. 

ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా వున్నారు. అందువల్ల సూర్య ప్రాజెక్టు మీదకు వెళ్లినపుడు హీరోయిన్ గా దీపిక ఫస్ట్ చాయిస్ అన్నది ఖాయం. సూర్య..దీపిక..త్రివిక్రమ్..హారిక హాసని అంటే..ఇక ఆ సినిమా రేంజ్ నే ఓ లెక్కలోవుంటుంది.