ఆటోజానీ..సూపర్ టైటిల్..అందుకే మెగాస్టార్ మనసుపడి, పూరి జగన్ కు 150 వ సినిమా చాన్సిచ్చేద్దామనుకున్నారు. కానీ తీరా కథ విన్నాక, టైటిలే బాగుందనిపించిందేమో, పూరికి హ్యాండిచ్చారు. లోఫర్ తరువాత ఒక్కసారిగా మళ్లీ ఆటోజానీ పేరు మళ్లీ వినిపించింది.
రవితేజతో పూరి ఈ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ ఆరా తీస్తే..అంతా ఉత్తుత్తునే అని వినిపిస్తోంది. రవితేజ ఇప్పుడు ఓ సినిమ కమిట్ అయి వున్నాడు..అది దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో. కానీ రవితేజ ఎనిమిది కోట్ల డిమాండ్ పుణ్యమా అని ఆ సినిమా పక్కన పడే ప్రమాదం కనిపిస్తోంది.
మరోపక్క డైరక్టర్ రెడీగా వుండి,ప్రొడ్యూసర్ లేకుండా మరో సినిమా వుంది. దాన్ని ప్రొడ్యూస్ చేయమని రంజిత్ మూవీస్ ను అడుగుతున్నారు రవితేజ. ఇలాంటి నేపథ్యంలో రవితేజ-పూరి కాంబినేషన్ లో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు వస్తారు. రవితేజకు ఎనిమిది కోట్లు, పూరికి అయిదారు కోట్లు, నిర్మాణ వ్యయం కలిపి ముఫైకి డేకేస్తుంది. లోఫర్ సినిమా అమ్మడం కష్టమయింది. బెంగాల్ టైగర్ అమ్మిన డబ్బులు రావడం కష్టమయింది.
ఇంతకీ వినిపిస్తున్న మరో గుసగుస ఏమిటంటే, మెగాస్టార్ కు ఆటోజానీ టైటిల్ మహా ఇష్టంగా వుంది కనుక, తనకు చాన్సివ్వకుంటే, ఆ టైటిల్ మరొకరికి వాడేస్తా అన్న ఫీలర్ పూరి క్యాంప్ నుంచి వచ్చిందేమో అన్నది. నూటా యాభై కాకుంటే, ఆ తరువాత అయినా చేద్దాం అని మెగాస్టార్ చిన్న మాట ఇస్తారమో అని ఆలోచనగా మరో గుసగుసగా వినిపిస్తోంది.
కానీ ఝలక్ ఏమిటంటే, ఆటోజానీ రవితేజ గ్యాసిప్ బయటకు వచ్చాక కూడా మెగా క్యాంప్ నుంచి ఏ స్పందనా లేదన్నది.