బ్రిటీష్ ప్రిమియర్ లీగ్ గురించి మాట్లాడేస్తున్నాడు హ్యాపీడేస్ హీరో నిఖిల్. ఇండస్ట్రీలో ఇప్పుడు బాగానే నిలదొక్కుకున్న ఈ హీరో ఇప్పుడు ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్..అంటూ ట్వీట్లు పెడుతున్నాడు! ఆ లీగ్ గురించి..అందులోని ప్రాంచైజ్ గురించి,ఆట గురించి..విశ్లేషిస్తున్నాడు. ఏడాది ఆసాంతం జరిగే ఆ ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ ఫలితాలను ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ…తన భావోద్వేగాలను పంచుకొంటున్నాడు.
మరి ఇండియాలో..అందునా తెలుగు వాళ్ల మధ్య ఫుట్ బాల్ కున్న ఆదరణ అంతంత మాత్రమే. అందులోనూ.. ఫుట్ బాల్ లీగులు అంటే .. అవి సగటు యువత కూడా పెద్దగా పట్టని సబ్జెక్టులే. ప్రపంచకప్ ఫుట్ బాల్ వంటి వాటిపై మాత్రం సాకర్ అంటే అంతో ఇంతో పరిచయం ఉన్న వాళ్లకు ఆసక్తి ఉంటుంది. మరీ ఫుట్ బాల్ లీగుల గురించి మాట్లాడటం అంటే..దానికి పెద్ద నాల్జెడ్జే ఉండాలి. నిఖిల్ కు అందుకు సంబంధించిన నాలెడ్జి, ఆసక్తి ఉన్నట్టుగా ఉంది.
గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. తెలుగు హీరోల్లో ఇతరువెవ్వరికీ కూడా ఇలాంటి ఆసక్తి కనపడటం లేదు. సో.. నిఖిల్ సాకర్ ఆసక్తిని పదుగురిలో ప్రదర్విస్తూ తన ఉన్నతాభిరుచులను బయటపెట్టుకుంటున్నాడేమో!