బాహుబలి 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలయింది. దీనిపైన ఎన్నో ఊహాగానాలు. కొత్త కొత్త వాళ్లను తీసుకుంటారని, కొత్త కొత్త లోకేషన్లకు వెళతారని. కానీ ఇప్పటికి రాజమౌళి డిసైడ్ అయిన దాని ప్రకారం,షూటింగ్ మధ్యలో ఒకటి రెండు రోజులు గ్యాప్ వుంటే వుండొచ్చు కానీ,ఏకథాటిగా సింగిల్ షెడ్యూలు మాదిరిగా కొనసాగుతుందట.
అలాగే ఇప్పటి వరకు వున్న నిర్ణయం ప్రకారం కొత్త ఫేస్ లు ఏవీ జోడించరట. అలాగే షూటింగ్ తొంభై అయిదుశాతం రామోజీ ఫిలిం సిటీలోనే చేసేస్తారు. కొత్త లొకేషన్ల అవసరం దాదాపు వుండదట. అంతా గ్రీన్ మాట్ లోనే చిత్రీకరిస్తారట. బాహుబలి 2 కోసం జనాలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పార్ట్ వన్ చివర్న చిన్న ట్విస్ట్ పెట్టి ముగించడంతో, ఏమవుతుంది..ఏమయి వుంటుందీ అన్న ఉత్కంఠ జనాల్లో నెలకొంది.