పూరీకి నో చెప్పిన బన్నీ?

బన్నీ ఇప్పుడు టాప్ రేంజ్ కు చేరిపోయాడు. బోయపాటి శ్రీనుతో సరైనోడు అనిపించుకుంటూనే, మరోపక్క విక్రమ్ కుమార్ కు కమిట్ అయిపోయాడు. ఇక ష్యూర్ హిట్..అంటే తప్ప సబ్జెక్ట్ ను కానీ, డైరక్టర్ ను…

బన్నీ ఇప్పుడు టాప్ రేంజ్ కు చేరిపోయాడు. బోయపాటి శ్రీనుతో సరైనోడు అనిపించుకుంటూనే, మరోపక్క విక్రమ్ కుమార్ కు కమిట్ అయిపోయాడు. ఇక ష్యూర్ హిట్..అంటే తప్ప సబ్జెక్ట్ ను కానీ, డైరక్టర్ ను కానీ ఓకె చేసే స్థితిలోలేడు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ కథ చెబుతాడంటే, ఇప్పుడు వద్దు అని చెప్పేసినట్లు టాలీవుడ్ లో ఓ గ్యాసిప్ గుప్పు మంటోంది. 

ప్రస్తుతం ఓ టాప్ హీరోతో సినిమా నిర్మిస్తున్న నిర్మాత, బన్నీని అప్రోచ్ అయ్యాడట..పూరి డైరక్షన్ లో సినిమా తీస్తానని. ఇప్పుడు ఓకె అనుకుంటే వన్ ఇయర్ తరువాత అయినా ఓకె అని కూడా అన్నాడట. అయితే డైరక్టర్ పూరి అని చెబితే బన్నీ నో అనేసాడని టాక్. అప్పటికీ, మంచి లైన్.. ఓసారి వినండి.. విన్నాక ఎస్ ఆర్ నో చెప్పండి అన్నా కూడా 'సారీ' అనేసాడట. పాపం,తను తీస్తున్న సినిమాకు దన్నుగా వుంటుంది.. ఈ ప్రాజెక్టు సెట్ చేస్తే అనుకున్న నిర్మాత ఆశ అడియాశ అయిందట.