టైమ్ బాగు లేకుంటే ఓడలు బండ్లు అవుతాయి. దర్శకుడు ఇంద్రగంటి పరిస్థితి ఇదే. బందిపోటు అంటూ అల్లరి నరేష్ ఓ క్లాస్ కామెడీ సినిమా తీద్దామని ప్రయత్నించి, బోర్లా పడ్డారు. ఇప్పుడు సినిమా ఇచ్చేవారు లేరు. చేసే వారు లేరు.
Advertisement
అష్టా చెమ్మాతో నానికి లైఫ్ ఇచ్చి హీరోను చేసాడు. అందుకే ఆ కృతజ్ఞతతో నాని ఇంద్రగంటిని మళ్లీ నిలబెట్టాలనుకుంటున్నాడట. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ అవుతోంది.
బాలయ్యతో ఎప్పుడో ఆదిత్య 369, ఆ తరువాత మిత్రుడు అనే సినిమా తీసిన శివలెంక ప్రసాద్ దీనికి నిర్మాత. మొత్తానికి మరో మాంచి ఫన్నీ క్లాసిక్ కు తెరతీస్తున్నారన్నమాట.