మొత్తానికి సమస్య తీరింది. డేట్ డిసైడ్ అయింది. కిక్ 2 ఈ నెల 21న విడుదల కావాలని ఫిక్సయ్యారు. ఈ మేరకు నిర్మాత కళ్యాణ్ రామ్ ఏర్పాట్లు ప్రారంభించారు. ఎన్ని స్క్రీన్లు దొరికితే అన్నింట్లో విడుదల చేయాలన్నది సంకల్పం. కనీసం వెయ్యి స్క్రీన్లు దాటుతుంది. అందులో డవుట్ లేదు. 21 నాటికి శ్రీమంతుడు విడుదలై రెండువారాలవుతుంది.
పైగా బాహుబలి నెల, శ్రీమంతుడు 15 రోజులు జనం రెండుమంచి సినిమాలయితే చూసారు. కానీ, పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ మాత్రం చూడలేదు. రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కోసం బి సి సెంటర్ల ప్రేక్షకులు మొహం వాచిపోయి వున్నారు. కిక్ 2 వాళ్ల ఆకలి కచ్చితంగా తీరుస్తుంది.
రవితేజ-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన కిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. మరి దాని సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ఎలా వుంటుందో చూడాలి. భారీగా ఖర్చు చేసారు, చూసిన మేరకు సీన్లు బాగున్నాయన్నది రసెష్ చూసిన ఓ నిర్మాత అభిప్రాయం. ఈ సినిమా హిట్ అయితే, బయట హీరోతో సినిమా తీసి హిట్ చేసుకున్నట్లు అవుతుంది కళ్యాణ్ రామ్ కు.