రాజ్ తరుణ్…ఉయ్యాల జంపాల తో ఓకె అనిపించుకున్న కుర్రాడు. సెకెండ్ అటెంప్ట్ గా, సినిమా చూపిస్తా మావా అంటూ ఓ పిక్చర్ చేసాడు. రావు రమేష్ కూడా కీలకపాత్రధారి. అవికా గౌర్ జోడీ. నక్కిన త్రినాధరావు డైరక్టర్. ఇప్పుడు ఈ సినిమాను 14న విడుదల చేయాలని డిసైడ్ అయిపోయారు. శ్రీమంతుడు సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పాలు కాస్త తక్కువ వున్నందున, తమ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అయినందున, గట్టెక్కేస్తామని ధీమా అయి వుంటుంది యూనిట్ కు.
కానీ సమస్య అది ఒక్కటే కాదు. ఈవారం సినిమా చూసిన తరువాత మళ్లీ ఫ్యామిలీలు థియేటర్ కు రావడానికి టైమ్ తీసుకుంటాయి. పైగా ఆ పైవారం కిక్ 2 వస్తొంది. పెద్ద సినిమా అయితే వేరు, చిన్న సినిమా అనేసరికి కాస్త నిర్లిప్తత. బాహుబలి, శ్రీమంతుడు రెండు సినిమాలకు వరుసగా డబ్బులు పెట్టి, ఇప్పుడు చిన్న సినిమాకు పెట్టాలి అంటే వెనకడుగు వేస్తారు.
పైగా వున్న మంచి థియేటర్లు అన్నీ బాహుబలి, శ్రీమంతుడు తో నిండిపోయాయి. మిగిలిన థియేటర్లలోనే ఈ సినిమా సద్దుకోవాలి. ఈ వైనం గమనించే దర్శకుడు తేజ, హోరా హోరీ వెనక్కు పోయింది. ఇలాంటి సిట్యువేషన్ లో రాజ్ తరుణ్ రావడం అంటే నలిగిపోవడానికి రెడీ అయిపోవడమే.