ఇక మహేష్ నే ‘దేశం’ బ్రాండ్ అంబాసిడర్

బహుశా 2019 ఎన్నికల నాటికి ఇక పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీకి పని లేకపోవచ్చు. పైగా అప్పటికి జనం కూడా ప్రశ్నిస్తానని చెప్పి, ఇంట్లో కూర్చుని, రాజకీయపార్టీని రిజిస్టర్ చేసి కూడా కోమాలో…

బహుశా 2019 ఎన్నికల నాటికి ఇక పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీకి పని లేకపోవచ్చు. పైగా అప్పటికి జనం కూడా ప్రశ్నిస్తానని చెప్పి, ఇంట్లో కూర్చుని, రాజకీయపార్టీని రిజిస్టర్ చేసి కూడా కోమాలో వుంచిన పవన్ కళ్యాణ్ అంటే పెద్దగా స్పందించపోవచ్చు. పైగా ఇప్పుడు శ్రీమంతుడు సినిమాతో మహేష్ అచ్చమైన తెలుగుదేశం బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించాడు. 

గ్రామాల దత్తత కార్యక్రమం తెలుగుదేశం చాలా కీలకంగా భావించింది. పైగా దీని కోసమే లోకేష్ అమెరికాలో కూడా పర్యటించారు. అలాంటి గ్రామం దత్తత అనే కాన్సెప్ట్ మీద నడిచింది శ్రీమంతుడు. ఇక సినిమాలో చాలా వరకు మహేష్ సైకిల్ మీదే కనిపిస్తాడు. ఇక రాబోయే ఏ ఎన్నికలైనా ఇక ఇవే ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ స్వయానా తెలుగుదేశం ఎంపీ కూడాను. 

అందువల్ల మహేష్ నేరుగా ప్రచారానికి రాకున్నా, అతగాడి ఫ్లెక్సీలు, చిత్రాలు తెలుగుదేశం పార్టీకి బాగా పనికివస్తాయి. మొత్తానికి పవన్ సపోర్ట్ తప్పుకుంటే ఎలా అని తెలుగుదేశం ఇక అంతగా ఆందోళన పడనక్కరలేదు.