మూడు రోజులు..యాభై కోట్లు?

నిన్న మొన్నటి దాకా సినిమా బ్లాక్ బస్టర్ అంటే టోటల్ గా నలభై నుంచి యాభై కోట్ల మధ్య వసూళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ముచ్చటగా మూడు రోజుల్లోనే యాభై కోట్లు వసూలు…

నిన్న మొన్నటి దాకా సినిమా బ్లాక్ బస్టర్ అంటే టోటల్ గా నలభై నుంచి యాభై కోట్ల మధ్య వసూళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ముచ్చటగా మూడు రోజుల్లోనే యాభై కోట్లు వసూలు చేసే సినిమాలు వచ్చేస్తున్నాయి. బాహుబలి సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ శ్రీమంతుడు కూడా కేవలం మూడు రోజుల్లోనే ఇంతకు ముందు వచ్చిన బ్లాక్ బస్టర్ల టోటల్ కలెక్షన్లు అందుకునేలా కనిపిస్తోంది. 

శుక్ర, శని, ఆది కలిపి వరల్డ్ వైడ్ గా 45 నుంచి 50 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. సోమవారం ఈ లెక్కలు బయటకు వస్తాయి. 45 కోట్లే అనుకున్నా, మళ్లీ మరో వీకెండ్ వుండనే వుంది. ప్రస్తుతానికి అన్ని సెంటర్లలో స్టడీగానే వుంది. ఈ లెక్కన వన్ వీక్ లోనే 70 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అంటే బాహుబలి సంగతి అలా వుంచితే, మిగిలిన తెలుగు సినిమాల రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోయినట్లే. మళ్లీ అందరూ తమ తమ కొత్త సినిమాలతో కొత్త రికార్డుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి.