కిక్ 2 సినిమా ఈ నెల 21 కన్నా విడుదల అవుతుందా? కాదా? అదే ఇప్పుడు ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్. అన్ని విధాల రెడీ అయిపోయింది. ఫైనాన్షియల్ సమస్యలు కూడా ఎన్టీఆర్ పుణ్యమా అని గట్టెక్కేసాయి. కానీ మరి ఇంకా ఎందుకు ముందు వెనుకలాడుతోంది?
శ్రీమంతుడు ఎఫెక్ట్ అనుకుందామంటే, అప్పటికి రెండు వారాలు పూర్తయిపోతాయి. ఆపైన అంత ఎఫెక్ట్ వుండదు. పోనీ వెనుక ఏమన్నా సినిమా వుందా అంటే 28న ఇప్పటి వరకు సినిమా లేదు. 4న రుద్రమదేవి వస్తుంది. అది వేరే జోనర్. అయినా రెండు వారాల స్పాన్ వుంటుంది. ఈరోజుల్లో అంతకన్నా ఎక్కువ ఆశించడం కష్టం. మరి ఎందుకు వెనుకాడుతున్నారో? దీని వెనుక ఒక రీజన్ అయితే వినవస్తోంది.
21 విడుదలకు నిర్మాతలు రెడీగానే వున్నారని, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు రెడీగా లేరని టాక్. బాహబలికి నాలుగు వారాలు వదిలేసారు. శ్రీమంతుడు కూడా అలా వదలాలని వారు పట్టుపడుతున్నారట. కిక్ 2 రాకపోతే, సెప్టెంబర్ 4 వరకు మరే సినిమా వుండదు. సినిమాలు రాకపోయినా, నెల రోజులు కలెక్షన్లు వుంటాయా అన్నది అనుమానం.
సోమవారం నాటికే విశాఖ ఐనాక్స్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వున్న ఆటలు ఇప్పటికి రెండు మూడు రో లు మాత్రమే ఫుల్ అయ్యాయి. ఫస్ట్ షొ టైమ్ ఆటలకే ఫిల్లింగ్ కనిపిస్తోంది. పోనీ మల్టీ ఫ్లెక్స్ లు వదిలేస్తే, సెమీ అర్బన్ థియేటర్లకయినా, రెండు వారాలకు మించి ఊపు వుంటుందా అన్నది అనుమానం. ఈ రోజు,రేపట్లో కిక్ 2 సంగతి తేలిపోవచ్చు.