వినాయక్ కు, నాగ్ కు ఇబ్బందే

దసరాకు అఖిల్ సినిమాను బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాలన్నది ప్రయత్నం. కానీ అదే టైమ్ లో వద్దామని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు రామ్ చరణ్. అతగాడి శ్రీనువైట్ల సినిమా రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ రెండు…

దసరాకు అఖిల్ సినిమాను బాక్సాఫీస్ ముందుకు తీసుకురావాలన్నది ప్రయత్నం. కానీ అదే టైమ్ లో వద్దామని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు రామ్ చరణ్. అతగాడి శ్రీనువైట్ల సినిమా రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీ అంటే కాస్త కష్టమే. ఎందుకంటే నాగ్ కు చిరంజీవితో మంచి సంబంధాలు వున్నాయి. అలాగే వినాయక్ కు చిరు అంటే ఎంతో అభిమానం గౌరవం. అందువల్ల ఈ క్లాష్ అన్న సమస్యే రాదు. 

అక్టోబర్ 3, 10, 17 మూడు తేదీలు వున్నాయి దసరా విడుదలకు. వీటిల్లో మధ్యలో ఓ వారం గ్యాప్ వదిలేసి అయినా ఫిక్స్ చేసుకోవాలి. లేదా సెప్టెంబర్ ఆఖరి శుక్రవారం 25 వుంది. ఇందులో ఏది చరణ్ సినిమాకో, ఏది అఖిల్ సినిమాకో మరి ఇంకా తేలాల్సి వుంది. ఈ మధ్యలో చాలా సినిమాలు దసరా దండయాత్రకు రెడీ అవుతున్నాయి. వాటిలో రామ్ శివమ్ఒకటి. కోన వెంకట్ శంకరాభరణం కూడా అదే టైమ్ కు రెడీ చేయాలని చూస్తున్నారు.  మొత్తం మీద దసరా డేట్ల ఫిక్సేషన్ అంత వీజీ కాదన్నమాటే.