జత కలసే తన కలల సినిమా అని…అంత మాత్రం చేత అది మహా గొప్ప సినిమా..అల్లు అరవింద్ చూసి, కొనేసి, శిరీష్ తో చెద్దామనుకున్నారనే లాంటి లేని కబుర్లుచెప్పనని డైరక్టర్ రాకేష్ అంటున్నారు. తన సినిమా అరవింద్ చూడడం కానీ, శిరీష్ తో రీమేక్ చేద్దామని అనడం కానీ జరగనే లేదని ఆయన తెలిపారు.
ఈ వదంతి ఎలా పుట్టిందో తనకు తెలియనే తెలియదన్నారు. నిజంగా అరవింద్ లాంటి పెద్దలకు నచ్చితే తనకు అవార్డు వచ్చినంత ఆనందం అన్నారు. సాయి కొర్రపాటి మాత్రం చూసి, ఔట్ రేట్ గా తీసుకున్నారని రాకేష్ తెలిపారు. అరవింద్ చూసారు..శిరీష్ రీమేక్ అన్నారు లాంటి వదంతులు విని ఇండస్ట్రీ పెద్దలు తనను అపార్థం చేసుకునే ప్రమాదం వుంది కనుక ఈ వివరణ ఇస్తున్నా తప్ప వేరు కాదని రాకేష్ ప్రకటించారు.