మహేష్ బాబు పార్టనర్ గా మారారు శ్రీమంతుడు సినిమాలో. ?ఇప్పుడు శ్రీమంతుడు సినిమా చూస్తే తెలుస్తోంది..ఖర్చు ఎంత జాగ్రత్తగా పెట్టారో. ఎక్కడా అనవసరపు ఆర్భాటం లేదు. భారీ ఖర్చు కనిపించలేదు. టెక్నీషియన్లకు ఖర్చు చేసారు. నటీనటలు లెక్కకు చాలా మందే వున్నారు. కానీ పాత్రలు అంతంత మాత్రం. అందువల్ల పెద్దగా పారితోషికాలు కూడా కావు.
ఇక పాటలు కూడా చాలా వరకు సెట్ లు వేసి కానిచ్చారు. మరీ ఎక్కువగా విదేశాలు తిరిగేయలేదు. చాలా చోట్ల సిజి వర్క్ తో పని కానిచ్చేసారు. మహేష్ పారితోషికం పక్కన పెడితే, సినిమాకు ఇరవై కోట్ల కన్నా ఎక్కువ అయి వుంటుందా అని అనుమానం. ప్రచారానికి మాత్రం కోటి వరకు ఖర్చు చేసి వుంటారని వినికిడి. అది కూడా మంచి ఫలితాన్నే ఇచ్చింది.
సినిమాను భారీ రేటుకు అమ్మారు. ఓవర్ ఫ్లోస్ భాగస్వామ్యం వుంది. అందువల్ల తొలి వెంచర్ చేసిన నిర్మాతలకు, హీరోకు కూడా మంచి లాభాలు దక్కినట్లే.