కొరియర్ బాయ్ వస్తున్నాడట

నితిన్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఎప్పుడో ప్రారంభమై, మరెప్పుడో దాదాపు పూర్తయిన సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్. నిజానికి ఈ సినిమాకు గౌతమ్ మీనన్ నిర్మాత మాత్రమే. ప్రభుదేవా దగ్గర పనిచేసిన ప్రేమ్ సాయి…

నితిన్-గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ఎప్పుడో ప్రారంభమై, మరెప్పుడో దాదాపు పూర్తయిన సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్. నిజానికి ఈ సినిమాకు గౌతమ్ మీనన్ నిర్మాత మాత్రమే. ప్రభుదేవా దగ్గర పనిచేసిన ప్రేమ్ సాయి డైరక్టర్.

అయితే గౌతమ్ మీనన్ నిర్మాత అన్నా కూడా ఆ మాత్రం ప్రభావం వుంటుంది. అందుకే క్రేజీ ప్రాజెక్టు అయింది ప్రారంభంలో. యామీ గౌతమ్ కథానాయిక. ప్లేబాక్ సింగర్ కార్తీక్ సంగీత దర్శకుడు. ఇలాంటి భిన్నమైన కాంబినేషన్ లో ఫిక్సయిన ఈ సినిమా ఆది నుంచీ, పడుతూ, లేస్తూ ముందుకు సాగుతూ వస్తోంది. ఆఖరికి చతికలపడిపోయింది.

ఇప్పుడు దీన్ని బయటకు తీస్తున్నారని వినికిడి. నితిన్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. మరో సినిమా రావడానికీ చాలా కాలం టైమ్ వుంది. అందుకే ఈ లోగా ఈ సినిమాకు రిపేర్లు చేసి, పూర్తి చేసే ప్రయత్నాలు ప్రారంభించారట. ఈ నెలాఖరుకు అడియో ఫంక్షన్ చేసి, వచ్చే నెలలో వదలాలని చూస్తున్నారట. లేటుగా వచ్చినా విషయం బాగుంటే కొరియర్ బాయ్ ను తప్పు పట్టలేం.