కత్తిపై అదే నిజమైంది

కత్తి లేదు.. అటకెక్కింది.. వరుణ్ దగ్గరకు వెళ్లింది.. అంటూ ఇలా రకరకాల మాటలు వినిపించారు ఎంతో మంది. మొదట్నించీ చెబుతున్నాం.. కత్తి వుంది.. వినాయక్ డైరక్ట్ చేస్తాడు.. అంటూ.. ఇటీవలే వెల్లడించాం.. పరుచూరి గోపాల…

కత్తి లేదు.. అటకెక్కింది.. వరుణ్ దగ్గరకు వెళ్లింది.. అంటూ ఇలా రకరకాల మాటలు వినిపించారు ఎంతో మంది. మొదట్నించీ చెబుతున్నాం.. కత్తి వుంది.. వినాయక్ డైరక్ట్ చేస్తాడు.. అంటూ.. ఇటీవలే వెల్లడించాం.. పరుచూరి గోపాల కృష్ణ ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారని కూడా. ఆ తరువాత మరోసారి, విషయాల ఫైనల్ అయ్యాకే బయటకు వెల్లడించాలని కూడా డిసైడ్ అయ్యారంటూ తెలిపాం.

ఇప్పుడు రామ్ చరణ్ నోటి వెంట కూడా అదేమాట మీడియాలోకి వచ్చింది.  వివి వినాయక్ డైరక్షన్ లో  కత్తి రీమేక్ చేస్తున్నామంటూ. ఇదే నిజం కూడా. బ్యాక్ గ్రవుండ్ వర్క్ స్పీడ్ గా జరుగుతోంది కూడా. అయితే ఏదో ఒకటి చెప్పడం.. వర్మ ట్వీట్ చేయడం.. ఈ తలకాయనొప్పి అంతా ఎందుకని సైలంట్ గా వర్క్ చేస్తున్నారన్నది వాస్తవం. 

అయితే ఇప్పటికీ తెలియంది ఒకటే.. కత్తి సినిమా ఒరిజినల్ వెర్షన్ తోనే ఓ రైటర్ తో వివాదం వున్నట్లు వినికిడి. అది మరి సెటిల్ అయితేనే, కథ ముందుకు నడుస్తుంది. మరి సెటిల్ అయిందా..చేసారా? లేదా అన్నదే.