యువి పేరు వాడేస్తున్నారా?

యువి క్రియేషన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ బ్రాండ్. పైగా ఇప్పుడు యువి ఎక్కవగా కథలు వింటోంది. దాంతో ఇండస్ట్రీలో యువితో సినిమా వుంది..యువి వాళ్లు మా కథ విన్నారు..యువిలో డిస్కషన్  లో…

యువి క్రియేషన్స్ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ బ్రాండ్. పైగా ఇప్పుడు యువి ఎక్కవగా కథలు వింటోంది. దాంతో ఇండస్ట్రీలో యువితో సినిమా వుంది..యువి వాళ్లు మా కథ విన్నారు..యువిలో డిస్కషన్  లో వుంది. ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

ఇదే టైపు వ్యవహారం గీతా 2 లో కూడా వుంది. కానీ గీతా 2 వ్యవహార ఎలా వుంటుందీ అంటే నిజమైన బయట ప్రచారంలోకి వస్తే, కాస్త ప్రాబ్లమ్. అందువల్ల దాని గురించి అంత ప్రచారం జరగడం లేదు. కానీ యువి ది కాస్త అతి మంచితనం టైపు. ఇటీవల ఓ యంగ్ హీరోతో యువి సినిమా తీస్తోంది అన్న వార్త బయటకు వచ్చింది. 

ఇదిగో సినిమా అంటే, అదిగో థియేటర్ అన్న టైపు కదా..మన టాలీవుడ్ అందుకే వెంటనే టకటకా ప్రచారంలోకి వచ్చేసింది. ఈ వార్త వచ్చిన విషయం తెలిసి యువి జనాలు తెల్లబోయారని వినికిడి. ఈ ప్రాజెక్టు మేం ఎప్పుడు అనుకున్నాం..అని వాళ్లకు వాళ్లే క్వశ్చను చేసుకున్నారని తెలుస్తోంది. సర్లే వార్తలు వస్తే మనకేంటీ..మనం తీసినపుడు కదా..అని లైట్ తీసుకున్నారట.