నాగ్ కొత్త ఛానెల్ నిజమా? గ్యాసిప్పా?

మా టీవీ హక్కులు పూర్తిగా వదులుకున్న హీరో నాగార్జున అతని సన్నిహితులు మరో కొత్త చానెల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇది నిజమా? గ్యాసిప్ మాత్రమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.…

మా టీవీ హక్కులు పూర్తిగా వదులుకున్న హీరో నాగార్జున అతని సన్నిహితులు మరో కొత్త చానెల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇది నిజమా? గ్యాసిప్ మాత్రమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున, చిరంజీవి తదితరుల ప్రమేయం కారణంగానే మా టీవీ అంచెలంచెలుగా ఎదగగలిగింది అన్నది వాస్తవం. 

ఇప్పుడు వారు మళ్లీ ఏ ఛానెల్ ప్రారంభించినా అది విజయం సాధిస్తుంద అనడంలోనూ సందేహం లేదు. ఎందుకంటే, సినిమాలు, కంటెంట్, ఇలాంటివి సులువుగా అందుబాటులోకి వస్తాయి. అయితే ఇక్కడ ఓ మెలిక వుంది. సాధారంణగా పెద్ద పెద్దకంపెనీలు చేతులు మారినపుడు, కొనుగోలు చేసిన సంస్థ కొన్ని షరతులు విధిస్తుంది. అమ్మినవారు మళ్లీ కొన్నాళ్ల పాటు అదే వ్యాపారం లోకి రాకుండా వుండేలా చూసుకుంటుంది. స్టార్ సంస్థ కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకుందని వినికిడి. 

అందువల్ల నాగ్ అండ్ కో నేరుగా మరో చానెల్ ప్రారంభించే అవకాశం తక్కువ. వేరేవారు ప్రారంభిస్తే, తెర వెనకు సహకారం అందిచగలరు. ఒకవేళ స్టార్ కనుక అలాంటి జాగ్రత్త తీసుకోకుంటే అది వేరే సంగతి. అయితే మా టీవీ నిర్వహణను కొంతకాలం ఇప్పుడున్న మేనేజ్మెంట్ చూడాలని, కోటీశ్వరుడు కార్యక్రమం తమకు కూడా కీలకమని ఒప్పందం సమయంలోనే సోనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 

అందువల్ల కొత్త చానెల్ రావడం అన్నది ఎంతవరకు సాధ్యమన్నది కొంత కాలం ఆగితే తప్ప తెలియదు. అయితే ఇటీవల నాగ్ తో సన్నిహితంగా, ఇండస్ట్రీకి బడా ఫైనాన్షియర్ గా వున్న పివిపి మాత్రం ఓ చానెల్ ప్రారంభించాలని యోచిస్తున్నట్లు గుసగుసలు వున్నాయి. బహుశా దానికి నాగ్ అండదండలు తెరవెనుక వుంటే వుండొచ్చు.