సత్యమూర్తి కొత్త ట్రెండ్

సినిమా విడుదలయిన తరువాత కలెక్షన్ల లెక్కలు చెప్పడం మామూలే. దాన్ని బట్టి, సినిమా బాగుందని ఓ అంచనాకు వచ్చి, మరింత మంది చూస్తారని ఓ ఐడియా. అయితే ఈ లెక్కలు చెప్పడంలో టాలీవుడ్ ఆనవాయితీ…

సినిమా విడుదలయిన తరువాత కలెక్షన్ల లెక్కలు చెప్పడం మామూలే. దాన్ని బట్టి, సినిమా బాగుందని ఓ అంచనాకు వచ్చి, మరింత మంది చూస్తారని ఓ ఐడియా. అయితే ఈ లెక్కలు చెప్పడంలో టాలీవుడ్ ఆనవాయితీ నెట్. బాలీవుడ్ పద్దతి గ్రాస్. కానీ ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తికి గ్రాస్ లెక్కలే చెబుతున్నారు. గ్రాస్ ఎర్నింగ్స్ సినిమా ఎర్నింగ్స్ కావు. అందులోంచి ఖర్చులు, తీసేయాల్సి వుంటుంది. 

సత్యమూర్తికి ఇప్పుడు చెబుతున్న తాజా లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 48.36 కోట్ల గ్రాస్ ఆదాయం వచ్చిందట. ఇందులో తెలంగాణ (నైజాం) 12.3 కోట్లు, ఆంధ్ర 19.2 కోట్లు, కర్ణాటక 6 కోట్లు,తమిళనాడు 1.2 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 60 లక్షలు, ఓవర్ సీస్ 8.4 కోట్లు అని పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ లెక్కలు ఎవరికీ తెలియవు. సినిమా హాళ్ల నుంచి డిసిఆర్ ఫిగర్లు డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడ నుంచి నిర్మాతకు వెళ్తాయి. పైగా అసలు, నకిలీ లెక్కలు రెండూ వుంటాయి. 

ఎందుకంటే పన్ను సమస్యలు వుంటాయి కాబట్టి. కానీ ఓవర్ సీస్ లెక్కలు పక్కగా వుంటాయి. అక్కడ శనివారం నాటికి వన్ మిలియన్ డాలర్లు వచ్చిందని, సోమవారం తో కలిపితే ఆరుకోట్ల పై చిలుకు వచ్చి వుంటుందని ట్రేడ్ వర్గాల బోగట్టా. కానీ ఈ ప్రెస్ నోట్ ప్రకారం 8.4 కోట్లు అంటున్నారు. అంటే దగ్గర దగ్గర రెండు కోట్లు తేడా వస్తోంది. ఏది నిజమో తెలియాల్సి  వుంది. 

ఒకవేళ ఆరు కోట్ల పై చిలుకు అన్నది నిజమే అయితే, అదే విధంగా ఇక్కడిలెక్కలు కూడా అధికంగా వేసారా అన్న అనుమానాలు వస్తాయి. ఏది ఏమైనా 48 కోట్లకు పైగా గ్రాస్ వచ్చందంటే, అదీ నాలుగు రోజులకు..రోజుకు పన్నెండు కోట్ల కింద లెక్క. తొలిరోజు గ్రాస్ లో సాధారణంగా అడ్వాన్స్ లు కలిపి చెప్పడం అలవాటు. మరి ఆ రోజే 12 కోట్లు చెప్పలేదు. కానీ ఏవరేజ్ ఏకంగా 12 కోట్లు అంటున్నారు? నిజానిజాలు డిసిఆర్ లకే తెలియాలి.