ఈ సారి మాత్రం నిత్యామీనన్ కు చెల్లెలు పాత్రే!

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో నిత్యామీనన్ నటిస్తోందన్న వార్తరాగానే.. ఆమెది అందులో హీరోకి చెల్లెలు పాత్ర అని వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కు నిత్య చెల్లెలిగా కనిపించనుందని అన్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక…

సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో నిత్యామీనన్ నటిస్తోందన్న వార్తరాగానే.. ఆమెది అందులో హీరోకి చెల్లెలు పాత్ర అని వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కు నిత్య చెల్లెలిగా కనిపించనుందని అన్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నిత్య అర్జున్ కు సిస్టర్ గా మంచి ప్రాధాన్యత  ఉన్న పాత్రలో చేస్తుందన్నారు. అయితే చివరకు మాత్రం అది తప్పని తేలింది.

ఒక ఫామ్ లో ఉన్న హీరోకి.. ఫామ్ లోఉన్న హీరోయిన్ చెల్లెలిగా చేసే అవకాశాలు లేనట్టుగా.. నిత్య సత్యమూర్తి గారబ్బాయికి ఒక జోడీగానే నటించింది. హీరోయిన్ గా కాకపోయినా.. సెకెండ్ , థర్డ్ హీరోయిన్ గా నిత్య నటించింది. ఆ పాత్రతో ఆమెకు ఒరిగిందైతే ఏమీ లేదనే చెప్పాలి.

ఇదిలా ఉంటే.. ఈ సారి మాత్రం నిత్యకు నిజంగానే చెల్లెలి పాత్ర లభించింది. తమిళ స్టార్ హీరో అజిత్ కు ఆమెచెల్లెలుగా చేయబోతోంది. అన్నా చెల్లెలి అనుబంధం కథాంశంగా రాబోతున్న ఒక సినిమాలో అజిత్ చెల్లెలి పాత్ర ను నిత్యకు ఆఫర్ చేశారట. ఈ పాత్ర కోసం తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా పోటీలో ఉందట. తమిళంలో రాణిస్తున్న ఈ అమ్మాయిని కానీ, నిత్యను కానీ అజిత్ చెల్లెలి పాత్రలో నటింపజేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి వీరిలో అజిత్ చెల్లెలిగా నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో!