ఉపేంద్ర ఇప్పుడు గుర్తొచ్చాడా?

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్రకు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతకాదు. అతగాడు కూడా పాత్ర వున్న మేరకు బాగా చేసాడు. అయితే హీరో పాత్ర కోసం విలన్ పాత్రను బాగా తగ్గించారన్న విమర్శలు…

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర పాత్రకు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతకాదు. అతగాడు కూడా పాత్ర వున్న మేరకు బాగా చేసాడు. అయితే హీరో పాత్ర కోసం విలన్ పాత్రను బాగా తగ్గించారన్న విమర్శలు అయితే వచ్చాయి.  

ముఖ్యంగా కర్ణాటక బోర్డరు ప్రాంతాల్లో, బెంగుళూరుల్లో సినిమా చూసిన ఉపేంద్ర అభిమానుల ఫీలయ్యారట కూడా. ఇదిలా వుంటే, సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి విడుదల వరకు ఉపేంద్ర వ్యవహారం పట్టని సినిమా యూనిట్ ఇప్పుడు తీరిగ్గా మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది.. 

మా సినిమాలో ఉపేంద్ర వున్నాడంటే, ఆ విధంగానైనా మరి కొంత మంది ఆడియన్స్ సినిమాకు పాజిటివ్ గా టర్న్ అవుతారని కావచ్చు.