ఎమ్బీయస్‌: లండన్‌లో కబుర్లు

యుకెలో నేను ప్రస్తుతం నాలుగు నెలలపాటు వుంటున్నది కొవెంట్రీ అనే వూళ్లో. (దాని గురించి ''మౌస్‌ట్రాప్‌'' అనే సీరీస్‌లో రాస్తాను) వచ్చిన నాలుగు రోజులకే నేను, నా భార్య వ్యక్తిగతంగా లండన్‌ వెళ్లి, తిరిగి,…

యుకెలో నేను ప్రస్తుతం నాలుగు నెలలపాటు వుంటున్నది కొవెంట్రీ అనే వూళ్లో. (దాని గురించి ''మౌస్‌ట్రాప్‌'' అనే సీరీస్‌లో రాస్తాను) వచ్చిన నాలుగు రోజులకే నేను, నా భార్య వ్యక్తిగతంగా లండన్‌ వెళ్లి, తిరిగి, వచ్చేశాం. అప్పటికే నా కాలమ్‌ ద్వారా నేను యుకె వస్తున్నానని తెలిసిన కొందరు పాఠకులు నన్ను కలుస్తామని ఈమెయిల్‌ ద్వారా తెలియపరచి, కలిశారు కూడా. నేను తిరిగి వచ్చేసిన తర్వాత కొంతమంది లండన్‌ వచ్చినపుడు నన్ను కలవాలనుకుంటున్నామని మెయిల్స్‌ రాశారు. మళ్లీ లండన్‌ వచ్చే ఛాన్సు లేదని జవాబు యిచ్చేశాను. అయితే తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) అనే సంస్థ, సిపి బ్రౌన్‌ ఫౌండేషన్‌ వారు నన్ను లండన్‌కు మళ్లీ రప్పించి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ డిసెంబరు 19 శనివారం నాడు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వెస్ట్‌ లండన్‌లోని హౌన్స్‌లోలో న్యూ లండన్‌ కాలేజ్‌లో ''ఎమ్బీయస్‌తో కబుర్లు'' అని నిర్వహిస్తున్నారు. భోజన కార్యక్రమానికి ఓ గంట పోయినా కబుర్లు చెప్పుకోవడానికి రెండున్నర గంటలుంటుంది. అంటే అంతసేపూ నేనేదో గంభీరోపన్యాసం యిస్తానని అనుకోవద్దు. మహా అయితే ఓ అరగంట మాట్లాడతానేమో, తక్కిన సమయమంతా ప్రశ్నోత్తరాలకే వెచ్చిస్తాము. నా రచనలు చదివేవారిలో కొందరికి నేను కనబడితే నాలుగూ అడిగి, కడిగిపారేద్దామని మహాముచ్చటగా వుంటుందని నాకు తెలుసు. వారిలో ఎవరైనా లండన్‌లో వుంటే, ఆ రోజు వచ్చేందుకు వీలుంటే యిది ఒక అవకాశం. కడిగే కార్యక్రమాలు లేకపోయినా ఉట్టినే చూడాలని కూడా కొందరికి అనిపిస్తుంది. (నాకూ చాలామంది అభిమాన రచయితలను ఉట్టినే చూడాలనిపిస్తుంది) వారూ రావచ్చు. ఇన్విటేషన్‌ కార్డు దీనితో జతపరుస్తున్నాను. వద్దామనుకున్నవాళ్లు ముందుగా నిర్వాహకులకు తెలిపితే ([email protected]) వాళ్లు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2015)

[email protected]