నటులందరూ వెంచర్లలోకే

నటనే వృత్తి కాదు ఇప్పుడు నటులకు..ఏదో అదర్ ఏవగేషన్, లేదా వెంచర్ తలకెత్తుకుంటున్నారు. ఒకే రోజు ఇద్దరు నటులు రెండు వెంచర్లు ప్రకటించారు. ఒక పక్క శృతి హాసన్ ఓ ప్రొడక్షన్ హవుస్ ను…

నటనే వృత్తి కాదు ఇప్పుడు నటులకు..ఏదో అదర్ ఏవగేషన్, లేదా వెంచర్ తలకెత్తుకుంటున్నారు. ఒకే రోజు ఇద్దరు నటులు రెండు వెంచర్లు ప్రకటించారు. ఒక పక్క శృతి హాసన్ ఓ ప్రొడక్షన్ హవుస్ ను ప్రకటించింది. ఆ మీడియా హవుస్ మీద షార్ట్ ఫిలిమ్ లు, డిజిటిల్ కంటెంట్ తయారుచేస్తామని ప్రకటించింది.

హీరో రానా కూడా తన వెంచర్ ప్రకటించాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఓ తెలుగు సినిమా నిర్మిస్తాడట. ఇది సురేష్ ప్రొడక్షన్ తో జాయింట్ వెంచర్. అందరూ కొత్తవాళ్లతో నిర్మించే ఈ పోస్టర్ బాయ్స్ సినిమాకు ఓ మరాఠీ సినిమా ఆధారం. స్టార్ హంట్ కూడా నిర్వహిస్తారట. దీనికి గోపి గణేష్ దర్ళకత్వం వహిస్తారట.

ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు ప్రొడక్షన్ లోకి వచ్చేసారు్. నాగార్జున అయితే ఈ విషయంలో అందరికీ ఆదర్శం. ఆయన ఇటు సినిమాలు, అటు సీరియళ్లు..ఇలా చాలా బిజీ. రామ్ చరణ్, వెంకటేష్ రాబోతున్నారు. ఎన్టీఆర్ కూడా తన సోదరుడు కళ్యాణ్ రామ్ బ్యానర్ లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. మొత్తానికి ఇలా నటులంతా వెంచర్లలోకి దిగుతున్నట్లే.