బాబీ..అలియాస్ రవీంద్ర..ఒక్క సినిమాతో పవర్ స్టార్ లుక్ లో పడిపోయి..గబ్బర్ సింగ్ 2 అనే సర్దార్ సినిమా డైరక్షన్ చాన్స్ కొట్టేసాడు. కానీ ఏడాదిదాటినా ఎక్కడ వేసిన గొంగళీ ఎక్కడే వుంది అన్నట్లు వుండిపోయాడు. మొత్తానికి ఇప్పటికి కదిలింది.
అయితే ఈ కదలిక వెనుక బాబీ కన్నా పవన్ వ్యవహారమే ఎక్కువగా వుందని, బుర్రా సాయిమాధవ్ చేత మాటలు రాయించారని, కథను మార్చి, అసోసియేట్ కు వివరించారని, తొలి సారిగా విడుదల చేసిన డిజైన్ ను కూడా పవన్ డిజైన్ చేసారని, ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ గా కాజల్ ను డిసైడ్ చేసారు. బహుశా అది కూడా పవన్ నే చేసి వుంటారనడంలో సందేహం లేదు.
ఎందుకంటే పవన్ ఏరి కోరి ఎంపిక చేసిన హీరోయిన్ ను ఇంకకరు మార్పించలేరు కదా..చేస్తే ఆయనే చేయగలరు. ఇప్పుడు ఇలా వినవస్తున్న, బయటకు వస్తున్న వార్తలుఅన్నీ దర్శకుడు బాబీని కలవర పెడుతున్నాయట. పాపం ఫీలవుతున్నాడట.
నిజానికి సినిమా గురించి తాను చాలా కష్టపడుతున్ననని, కాజల్ ఎంపిక వెనుక కూడా తాను వున్నానని, దర్శకుడిగా సినిమా కోసం ఇంత చేస్తున్నా, తనకు అన్నీ నెగిటివ్ వార్తలే వస్తున్నాయని బాబీ ఫీలవుతున్నాడట. ఇక మీడియా పాపం, బాబీ శ్రమను గుర్తించే పనిలోవుండాలి మరి.