ఎన్టీఆర్ తో త్వరలో సినిమా అని ఆ మధ్య దిల్ రాజు చెప్పాడు. కత్తి సినిమా ఎన్టీఆర్ తో రీమేక్ చేస్తున్నట్లు గోపీచంద్ మలినేని కొంతమందితోనైనా చెప్పాడు. గోపీచంద్ మలినేనితో దిల్ రాజు సినిమా నిర్మిస్తాడని వార్తలు వినవచ్చాయి. వీటన్నింటిని కలిపితే, ఎన్టీఆర్-గోపీచంద్ మలినేని-దిల్ రాజు..అంటే కత్తి రీమేక్ అనుకున్నారు. అంతవరకు బాగానేవుంది.
సుకుమార్ సినిమా ఓ పక్క తయారవుతోంది.ఆ హడావుడిలో బిజీగా వున్నాడు ఎన్టీఆర్. వెబ్ లో వార్తలు మామూలే. సాధారంణగా వాటిని మరీ ఇబ్బంది కరమైతే తప్ప సీరియస్ గా పట్టించుకోరు. అలాంటిది ఎన్టీఆర్ వున్నట్లుండి, తాను కత్తి సినిమా రీమేక్ లో నటించడం లేదని, తన తరువాతి ప్రాజెక్టులు ఇవి అని అర్జెంట్ గా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది.
మరోపక్క గోపీచంద్ మలినేని ఈ విషయంలో వున్నట్లుండి సైలెంట్ ఎందుకు అయిపోయారు. కత్తి రీమేక్ తనకు ఏమీ తెలియదని, దిల్ రాజును అడగమని ఎందుకు అంటున్నాడు. గతంలో ఆయనే చెప్పాడు కదా ఎన్టీఆర్ తో చేస్తున్నా అని. ఇంతలో ఏమయింది? పోనీ దిల్ రాజుకు ఎన్టీఆర్ కు టెర్మ్స్ లేవా అంటే మంచి సంబంధాలే వున్నాయి. కళ్యాణ్ రామ్ పటాస్ విషయంలో బాగానే సాయం చేసాడు. మరి ఇప్పుడేమయింది? ఒకటిరెండు రోజులు ఆగితే అన్నీ బయటకు వస్తాయేమో?