Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ మరో రెండు సినిమాలు

మహేష్ మరో రెండు సినిమాలు

ఒకపక్క శ్రీమంతుడు విడుదలకు రెడీ అవుతోంది..బ్రహ్మోత్సవం సెట్ పై వుంది. ఈలోగా మహేష్ మరో రెండు స్క్రిప్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. ఇప్పుడు ఆయన నితిన్-సమంతలతో హారిక హాసిని సంస్థ సినిమాపై వున్నారు. ఇది కేవలం 55 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పం. ఈ లోగా మహేష్ బ్రహ్మోత్సవం అయిపోతుంది. ఇక మరో ప్రాజెక్ట్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో. దీనికి కూడా మహేష్ ఓకె చెప్పినట్లు వినికిడి. పూరి కూడా ఈ స్క్రిప్ట్ పై వర్క మొదలు పెట్టారట. అంటే మొత్తం మూడు సినిమాలు. ఒక విధంగా 2016 డైరీ ఫుల్ అయిపోయినట్లే అనుకోవాలి. మహా అయితే మరో సినిమాకు చాన్స్ వుంటుంది. దానికి వినాయక్ పేరు వినిపిస్తూనే వుంది. 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?