అఖిల్ వల్ల బయ్యర్లకు వచ్చిన నష్టాల వ్యవహారం ముగిసిపోయినట్లు వినికిడి. దర్శకుడు వినాయక్ మూడు కోట్లు, నిర్మాత నితిన్ కొటిన్నర మొత్తం నాలుగున్నర కోట్లు, ఆంధ్ర, సీడెడ్ లో బయ్యర్లకు అడ్జెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి కొంచెం తరువాతి సినిమాల్లో చూసుకుంటామన్నారని టాక్.
ఇక నైజాంలో మాత్రం నితిన్ తండ్రి సుధాకర రెడ్డి స్వయంగా చూసుకుంటున్నారని అంటున్నారు.ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ తో వారికి కూడా లావాదేవీలు వున్నాయని,అందువల్ల అక్కడ స్వంత వ్యవహారమే అని తెలుస్తోంది. బయ్యర్లు ఇరవై శాతం వరకు నష్టాలు భరించవచ్చని, పైన దాటితే అడ్జెస్ట్ చేసుకోవాలని చాంబర్ నిర్ణయం వుంది.
ఆ మేరకు ఇరవై శాతం బయ్యర్ల పై వేసి, మిగిలినది వీళ్లు అడ్జెస్ట్ చేసారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఏదో విధంగా సెటిల్ అయింది..ఇక నితిన్ కు ఏ తలకాయనొప్పి వుండదు.