దిల్ రాజు ఓ మంచి బేర పట్టేసారు. మణిరత్నం సినిమా తెలుగుహక్కులకు కేవలం నాలుగు కోట్లు మాత్రం ఖర్చు చేసారు. అన్నీ కలుపుకుంటే అయిదు కోట్లు కూడా కాదు. సినిమా ఏ మాత్రం బాగున్నా, ఫ్యామిలీ, యూత్ రోమాంటిక్ సినిమా కాబట్టి శాటిలైట్ హక్కులే మూడు కోట్ల వరకు వచ్చేస్తాయి.
Advertisement
ఎపి తెలంగాణ కలిపి అయిదు కోట్లు సాధించడం పెద్ద కష్టం కాదు. మణి రత్నం మార్కెట్ బాగా పడిపోవడం వల్ల, దిల్ రాజకు ఈ డీల్ స్వంతమైంది. ఇప్పటి వరకు వున్న సమచారం ప్రకారం సినిమా బాగానే వుండేలా వుంది. నిత్యమీనన్ సోలోగా వేసిన సినిమాలేవీ ఇంతవరకు నిరాశ పర్చలేదు. అందువల్ల దిల్ రాజు జాక్ పాట్ కొట్టేటట్లే వుంది.