మొత్తానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యవహారాన్ని మెల్లగా అటక ఎక్కించేసారు. బోలెడు అవకతవకలు జరిగాయి అని విమర్శలు వినిపిస్తుంటే, కోట్లు గోల్ మాల్ అయ్యాయని కొందరు గగ్గోలు పెడుతుంటే,సింపుల్ గా 80 లక్షల మేరకు గల్లంతు అయ్యాయని లెక్క తేల్చేసారు. అది కూడా ఇద్దరు బడుగు ఉద్యోగుల పాపం అని అంటగట్టేసారు. వాళ్లు ఇద్దరు తిరిగి చెల్లించేస్తామన్నారని చెబుతున్నారు.
నిజంగా ఆ ఉద్యోగులే 80 లక్షలు పక్కదారి పట్టించేసినపుడు, వెంటనే పోలీసు రిపోర్టు ఇవ్వాలి కదా? అప్పుడు తేలుతుంది కదా? వాళ్లు చేసారో, వెనక ఎవరో చేసి, ఇప్పుడు వారి మీద పెడుతున్నారో? ఎవరైనా 80 లక్షలు గోల్ మాల్ చేసినపుడు, వెంటనే చేసే పని పోలీసు కంప్లయింట్ ఇవ్వడం.
కానీ కౌన్సిల్ పెద్దలు, ఏం చేయాలా అన్నది డిసైడ్ చేసేందుకు కమిటీ వేసారు. దాసరి అధ్యక్షతన వేసిన ఈ కమిటీ, 80 లక్షలు కట్టిన వారి మీద ఏం యాక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేస్తుందట. ఇలా ఎక్కడిక్కడ వాళ్లే డెసిషన్ తీసుకుంటే ఇక చట్టం ఎందుకో? అంటే దాసరి కమిటీ పేరిట, సింపుల్ సమస్యను అటకెక్కించేసారు అనుకోవాలంతే.