లింగార్పణమస్తు

కొద్ది రోజుల తేడాలో వచ్చిన రెండు భారీ తమిళ సినిమాలు బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిలో ఒకటి రజనీ లింగా. దాని ఫలితం తేలిపోయింది. రెండవది శంకర్-విక్రమ్ కాంబినేషన్ లోని ఐ. దాని…

కొద్ది రోజుల తేడాలో వచ్చిన రెండు భారీ తమిళ సినిమాలు బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిలో ఒకటి రజనీ లింగా. దాని ఫలితం తేలిపోయింది. రెండవది శంకర్-విక్రమ్ కాంబినేషన్ లోని ఐ. దాని ఫలితం కూడా లింగా బాటలోనే వుండేలా టాక్ వస్తోంది. 

చిత్రమేమిటంటే, ఈ సినిమాలో, ఆ సినిమాలో కూడా హీరో పేరు లింగేశ్వర్ కావడం. ఇంకో విశేషమేమిటంటే, ఎమీజాక్సన్ నటించిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు (తెలుగులో నటించిన ఒకటీ మినహాయిస్తే) హిట్ అన్నది లేదు కెరియర్ లో. ఆ సెంటిమెంట్ కూడా మరోసారి వర్కవుట్ అయిపోయింది ఐ తో. 

బాలీవుడ్ కు వెళ్లిన తరువాత రెహమాన్ సరైన పాటలు సౌత్ వాళ్లకి ఇచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ. కానీ శంకర్ కాబట్టి జనం కాస్త ఆశలు పెట్టుకున్నారు. అవి కూడా అడియాసలైపోయాయి.