జగపతి కట్..కట్..

సినిమా తీయడం అంటే ఇరవై రీళ్లయినా తీసేస్తారు కానీ, జనాలకు ఎంత చూపిస్తే బాగుంటుందో అంతే చూపిస్తారు. మిగిలినదంతా ఎడిటింగ్ రూమ్ లో కంప్యూటర్ కే పరిమితం అవుతుంది. అయితే ఒక్కోసారి మంచి సీన్లు…

సినిమా తీయడం అంటే ఇరవై రీళ్లయినా తీసేస్తారు కానీ, జనాలకు ఎంత చూపిస్తే బాగుంటుందో అంతే చూపిస్తారు. మిగిలినదంతా ఎడిటింగ్ రూమ్ లో కంప్యూటర్ కే పరిమితం అవుతుంది. అయితే ఒక్కోసారి మంచి సీన్లు లేపేసారని అందులో నటించిన జనాలు బాధపడడం మామూలే.

ఇప్పుడు జగపతి బాబు అలాగే ఫీల్ అవుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయ. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో జగపతి బాబుది కూడా ఓ కీలకపాత్ర. లెజెండ్ సినిమా విలన్ గా మారిస్తే, శ్రీమంతుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుస్తుందన్న నమ్మకంతో వున్నాడట.

అలాంటపుడు కొన్ని సీన్లు లేచిపోయేసరికి కాస్త ఫీలయ్యాడని వినికిడి. తప్పుదు.. నిడివి పెరిగినపుడు, ఇబ్బంది అవుతుంది అనుకున్నపుడు సీన్లు లేపక తప్పదు. అయితే జగపతి అలకకు, మహేష్, దర్శకుడు కొరటాల శివ ఊరడింపు వర్కవుట్ అయిందని వినికిడి.