రెడ్ బుల్ సింహమా? పేరడీ సింగమా?

సంపూర్ణేష్ బాబు సుడి బాగుంది. లేకుంటే నెటిజన్ల పుణ్యమా అని పేరు తెచ్చుకున్న హృదయకాలేయం తప్ప మరో సరైన సినిమా లేదు. కానీ ఇప్పుడు నలభై ఏళ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్…

సంపూర్ణేష్ బాబు సుడి బాగుంది. లేకుంటే నెటిజన్ల పుణ్యమా అని పేరు తెచ్చుకున్న హృదయకాలేయం తప్ప మరో సరైన సినిమా లేదు. కానీ ఇప్పుడు నలభై ఏళ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు సమర్పించు అనే బ్యానర్ కు హీరో అయిపోయాడు. 

ముగ్గురు హీరోలున్న స్వంత సంస్థ, బాలకృష్ణలాంటి పెద్ద హీరోతో సినిమా తీసిన సంస్థ, కానీ ఇప్పుడు సంపూను హీరోను ఎంచుకుందంటే సుడికాక ఏమనాలి? ఈ సినిమాకు తెరవెనుక మంచు విష్ణు మాటలు, డైరక్షన్ చాలా వరకు  అందించాడని వినికిడి.తెరపై వేరే పేర్లు వున్నాయనుకోండి. ఇప్పుడు ఈ సినిమా టీజర్ బయటకు వచ్చింది. 

Watch Singham123 Teaser

అదీ అల్లు అర్జున్ పుట్టిన రోజున. పైగా ఇందులో అతగాడి డైలాగ్ పేరడీ కూడా..రేసుగుర్రాన్ని కాదు..రెడ్ బుల్ సింగాన్ని అంటూ రెచ్చిపోయాడు. పైగా బిరుదులో కూడా మెగా..సూపర్ స్టార్ పదాలు చేర్చుకున్నాడు. మరి సినిమా ఏ రేంజ్ లో వుంటుందో?