నిన్నటికి నిన్న అల్లు అర్జున్ కు ప్రింట్ మీడియాకు నడుమ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఈరోజు అది దర్శకుడు త్రివిక్రమ్ దృష్టికి వెళ్లింది. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకు సంబంధించి అటు నిర్మాణం, ఇటు దర్శకత్వం, ప్రచారం మొత్తం తన చేతుల మీదే నడిపిస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే రంగప్రవేశం చేసారు.
ఈరోజు మధ్యాహ్నం మళ్లీ అల్లు ప్రెస్ మీట్ అరేంజ్ కావడం వెనుక త్రివిక్రమ్ ప్లానింగ్ వుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో కూడా ముందు త్రివిక్రమ్ నే మాట్లాడే అవకాశం వుంది. మీడియాను సర్దుబాటు చేసి, బన్నీ ఇంటర్వూలు చేయించే బాధ్యత ఇప్పుడు ఆయన చేపట్టారేమో?
సన్నాఫ్ సత్యమూర్తిని ఇబ్బంది పెట్టే ఏ చిన్న అంశాన్ని త్రివిక్రమ్ అలా వదిలేయడం లేదు. వెంటనే పరిష్కరిస్తున్నారు. గతంలో ప్రచారం విషయంలోనూ, ఇప్పుడు బన్నీ విషయంలోనూ. బహుశా హారిక హాసిని బ్యానర్ లో త్రివిక్రమ్ పార్టనర్ అన్న వదంతులు వున్నాయి. అందుకేనలో ఇదంతా?